జాతీయంటాప్ స్టోరీస్రాజకీయం
వెంకన్నపై విజయసాయి పుస్తకం

తిరుమలలో శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారంపై రోజుకో దుమారం లేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దేవుడి నగలు మాయమయ్యాయంటూ, స్వామివారి నగలు విదేశాలకు తరలివెళ్లాయని ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఓ పుస్తకం రాశారు. ‘ గ్లోరీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర’ పేరుతో పుస్తకం రాసినట్లు స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు గుజరాతిలో కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల ఆభరణాల మాయంపై ఏపీ ప్రభుత్వం జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలనుకుంటున్నతరుణంలో విజయసాయిరెడ్డి పుస్తకం రావడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుంది.