సినిమా

కోలుకుంటున్న హీరోయిన్ యాషికా.. వీడియో ఇదిగో!

  • ఇటీవ‌ల త‌మిళ‌నాడులో యాక్సిడెంట్
  • ఆసుప‌త్రిలో న‌డ‌క సాధ‌న‌
  • త‌న‌కు ప‌డ్డ కుట్ల‌ను చూపించిన హీరోయిన్

తమిళనాడులో ఇటీవ‌ల జ‌రిగిన‌ ఓ రోడ్డు ప్రమాదంలో సినీ నటి యాషికా ఆనంద్‌కు తీవ్రగాయాలైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఆమె స్నేహితురాలు పావని ప్ర‌మాదంలో మృతి చెందారు. ప్ర‌స్తుతం యాషికా ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఒక్కో అడుగు వేస్తూ.. న‌డ‌వ‌డానికి చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు సంబంధించిన వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తోంది.

చెన్నైలోని ప్రైవేటు ఆసుప‌త్రిలో వైద్యుల సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నట్టు వివ‌రించింది. త‌న‌కు త‌గిలిన గాయాల‌ను, ప‌డుతోన్న బాధ‌ను తెలుపుతూ ఆమె క‌న్నీరు పెట్టుకుంది. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, యాక్సిడెంట్ కేసులో ఆమెను త్వరలోనే పోలీసులు విచారించనున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన నోటా సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.  

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close