అంతర్జాతీయం

ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం

అరూకా: పోర్చుగల్‌లో నిర్మించిన ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. పెద్ద లోయకు ఇరువైపుల ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన కాంక్రీటు టవర్స్ మధ్యన స్టీల్ కేబుల్స్ తో ఈ బ్రిడ్జి వేలాడుతుంది. దీని పొడవు516 మీటర్లు. అంటే అరకిలోమీటరు పైనే అన్నమాట. అరూకా అనే ప్రాంతంలో పైవా నదిపై దీనిని నిర్మించారు. ప్రాంతంపేరు, పొడవు కలిపి అరూకా516 అని ఈ వంతెనకు పేరుపెట్టారు. లోయ అడుగు భాగం నుంచి 175 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. ఇది పూర్తిగా కాలిబాట వంతెన. పక్కలకు, కింద కేవలం జాలీలు మాత్రమే ఉంటాయి. దీనిపై నడిచేవారికి కొంచెం గుండెదిటవు అవసరమే. చాలామంది దిక్కులు చూసి లేక కింద పారుతున్న నదిని చూసి భయంతో బిగుసుకు పోయే అవకాశం ఉంటుంది. యునెస్కో గుర్తింపు పొందిన అరూకా జియోపార్కులో ఈ వంతెన ఉంటుంది.

ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close