సినిమా

యూత్ కి కనెక్ట్ అయ్యే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్

  • ఈ నెల 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’
  • నలుగురు కథానాయికలతో జర్నీ 
  •  డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రూపొందిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ కథానాయికలుగా నటించారు. ఆ నలుగురు కథానాయికలతో ఆయన సాగించిన జర్నీకి సంబంధించిన విజువల్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. కొత్త ఏడాదిలో తొలి హిట్ కొడతాడేమో చూడాలి మరి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close