జాతీయంటాప్ స్టోరీస్టెక్నాలజీ

భారత్‌లో శాంసంగ్‌ అతిపెద్ద ఫోన్ ఫ్యాక్టరీ ప్రారంభం

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ పరిశ్రమను నోయిడాలో సోమవారం ప్రారంభించింది. దీని వల్ల శాంసంగ్ తన ఫోన్లను చాలా తక్కువ ధరకే భారత్‌లోని వినియోగదారులకు అందించేందుకు వీలు కలుగుతుంది.

ప్రధాని మోడీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ లు కలిసి సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. 2007 నుంచి శాంసంగ్ తన ఫోన్లను ఇండియాలో అసెంబుల్ చేస్తుండగా ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఫోన్లను ఇక్కడే తయారు చేయవచ్చు. దీని వల్ల ఫోన్లను చాలా తక్కువ ధరలకే వినియోగదారులు పొందవచ్చు. అలాగే ఎన్నో లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టింపబడతాయి. అనేక మందికి ఉపాధి దొరుకుతుంది.

ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అనేక కంపెనీలు ఇప్పటికే భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. త్వరలో మరిన్ని కంపెనీలు పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి. ఇక నోయిడాలో శాంసంగ్ ఏర్పాటు చేసిన పరిశ్రమ వల్ల ఏడాదికి 120 మిలియన్ యూనిట్ల ఫోన్లను తయారు చేసేందుకు వీలు కలుగుతుంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close