అంతర్జాతీయం

వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రణాళికలు రూపొందించాలి -డబ్ల్యూహెచ్‌వో

ఆగ్నేయ ఆసియా దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆ దేశాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అందరూ సమష్టిగా కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిచ్చింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని దేశాలను కోరింది.  ఇటీవల, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వస్తుందని తెలిపారు. 

‘ప్రపంచంలోని ఇతర దేశాల్లోలాగే ఆగ్నేయ ఆసియా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తిని ఆపడానికి బలమైన నాయకత్వం, పకడ్బందీ ప్రజారోగ్య చర్యలు, స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండాలి.’ అని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా రీజియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ రేసు ఊపందుకుందని వెల్లడించారు. మొదట వ్యాక్సిన్‌ లభ్యత పరిమితమయ్యే అవకాశమున్నందున జాతీయ టీకా వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేయాల్సి ఉంటుందన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close