జాతీయంటాప్ స్టోరీస్స్పెషల్

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు.. అనుమతులున్నవి.. అనుమతుల్లేనివి..

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నిన్న ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. హాట్‌స్పాట్‌ లేని ఏరియాల్లో ఏప్రిల్‌ 20 తర్వాత కొంత సడలింపు కేంద్రం తెలిపింది. 

అనుమతులు ఉన్నవి.. 

– ఆస్పత్రులు, టెలీ మెడిసిన్‌ సర్వీసులు యథాతథం.

– ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, మెడికల్‌ షాపులు యథాతథం. 

– ఔషధ పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు యథాతథం. 

-బ్యాంకుల కార్యకలాపాలు యథాతథం. 

-దివ్యాంగ, అనాథ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి. 

– నిబంధనల మేరకు పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి.

-ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి.

-వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతి.  పంట కోత యంత్రాల రవాణాకు అనుమతి.

– వ్యవసాయ పరికరాలు, విడి భాగాల దుకాణాలకు అనుమతి. వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చేందుకు అనుమతి.

– విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుల మందు దుకాణాలకు అనుమతి.

– ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి.

– దాణా సరఫరాకు అనుమతి.

– రోడ్డు పక్కన దాబాలు, వాహన మరమ్మతులకు అనుమతి. 

-ఉపాధి హామీ కూలీలకు అనుమతి.

– గ్రామాల్లో రోడ్లు, సాగునీటి పనులకు అనుమతి. 

-భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతి..

-కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ. 

-ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సర్వీసులు యథాతథం. 

-డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం. 

-ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి. 

– అంత్యక్రియలకు 20 మందిని మించి హాజరు కావొద్దు. వివాహాలకు, ఇతర శుభ కార్యక్రమాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి.

– టీ, కాఫీ, రబ్బర్‌ ప్లాంటేషన్స్‌లో 50 శాతం కార్మికులతో పనులకు అనుమతి.

-పాలు, పాల ఉత్పత్తుల కేంద్రాలతో పాటు పాల క్రయవిక్రయాలకు అనుమతి. 

– ఆన్‌లైన్‌ టీచింగ్‌కు అనుమతి.

– పెట్రోల్‌, గ్యాస్‌ రవాణా సేవలు యథాతథం.

– ఈ-కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి. 

– గోదాములు, శీతల గోదాములకు అనుమతి.

– ఎలక్ట్రిషీయన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్స్‌, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి.

అనుమతులు లేనివి.. 

-అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి నిరాకరణ(మెడికల్‌, భద్రతకు సంబంధించిన విమానాలకు మినహాయింపు).

– రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు సర్వీసుల నిలిపివేత.

– అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లాల మధ్య రవాణా నిషేధం(మెడికల్‌ సేవల వాహనాలకు మినహాయింపు).

– విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, కోచింగ్‌ కేంద్రాలు, సినిమా హాల్స్‌, మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, బార్లు, ఆడిటోరియంలు మూసివేత.

– మత, దైవ ప్రార్థనలు నిషేధం.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close