తెలంగాణ

ప్ర‌జార‌క్ష‌ణ‌లో ఏ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైనా ఖండిస్తాం -అస‌దుద్దీన్ ఓవైసీ

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం చెల‌రేగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ఎంఐఎం పార్టీ అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. భార‌త రాజ్యాంగం ప్రకారం ప్ర‌తి మ‌నిషికి జీవించే హ‌క్కు అనేది ప్రాథ‌మిక హ‌క్కు అని పేర్కొన్నారు. ఏ ప్ర‌భుత్వానికైనా ప్ర‌జల జీవించే హ‌క్కును కాపాడ‌ట‌మే ప్ర‌ధాన‌ విధి అయి ఉండాల‌ని అస‌ద్ సూచించారు.

ఏ ప్ర‌భుత్వ‌మైతే ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేకపోత‌దో ఆ ప్ర‌భుత్వం విధి నిర్వ‌హ‌ణ‌లో పూర్తిగా విఫ‌ల‌మైన‌ట్టేన‌ని అస‌దుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఏ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైనా ఆ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని తాము ఖండించి తీరుతామ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close