జాతీయం

కోబ్రా ఫోర్స్‌లోకి మ‌హిళ‌ల్ని తీసుకుంటున్నాం -సీఆర్‌పీఎఫ్ డీజీ

న్యూఢిల్లీ: గ‌త ఏడాది 215 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు సీఆర్‌పీఎఫ్ డీజీ ఏపీ మ‌హేశ్వ‌రి తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  రియాజ్ నాయికోను జ‌మ్మూక‌శ్మీర్‌లో హ‌త‌మార్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  కోబ్రా ద‌ళంలోకి మ‌హిళా యోధురాళ్ల‌ను రిక్రూట్ చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు.  న‌క్స‌ల్ కార్య‌క‌లాపాల‌ను అడ్డుకునేందుకు కోబ్రా ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. యూఏవీలు, ట్రాక‌ర్లు, అజాల్ట్ రైఫిళ్ల‌ల‌ను త‌మ అమ్ముల‌పొదిలో చేర్చుకున్న‌ట్లు చెప్పారు. ఈ కొత్త ఆయుధాల‌తో త‌మ ద‌ళం మ‌రింత బ‌లోపేతం అయిన‌ట్లు తెలిపారు.  కే9 ద‌ళాన్ని ప‌టిష్టం చేసేందుకు బెంగుళూరులో డాగ్ బ్రీడింగ్‌, ట్రైనింగ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఏపీ మ‌హేశ్వ‌రి తెలిపారు. డిపార్ట్‌మెంట్‌లో గాయ‌ప‌డ్డ‌వారిని సైబ‌ర్ సెక్యూర్టీ ద‌ళంలో చేర్చుతున్న‌ట్లు డీజీ మ‌హేశ్వ‌రి చెప్పారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close