స్పెషల్

వండే ముందు ఉప్పుతో కడగండి

మాంసంపై మీమాంస వద్దే వద్దు పోషకాహార సంస్థ భరోసా

కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అవసరం. మాంసం ద్వారా ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాంసం తినాలా వద్దా? తింటే ఏమైనా సమస్యలున్నాయా? శాకాహారమే మంచిదా? పండ్లు, కూరగాయలే తినాలా? అన్న సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జాతీయ పోషకాహార సంస్థ స్పందించింది. మాంసం ఆరోగ్యానికి మంచిదని, కాకపోతే మాంసం కొన్నాక ఉప్పుతో కడిగి వండుకొని తినాలని సూచించింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలే కాకుండా.. మటన్‌, చికెన్‌, చేపలు వంటి మాంసాహారం తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని తెలిపింది. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్‌ సైంటిస్టులు మాంసాహార వినియోగంపై స్పందించారు. మటన్‌, చికెన్‌, చేపలు తినడం ద్వారా కండరాల పటుత్వంతో పాటు ఎముకలు బలంగా ఉంటాయని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మటన్‌, చికెన్‌, చేపలను ఉప్పు నీటితో శుభ్రంగా కడగాలి. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్న దుకాణాల నుంచి మాత్రమే మాంసం కొనుగోలు చేయాలి’ అని వివరించారు. వండిన తర్వాత బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉన్నందున సందేహం లేకుండా మాంసం తినొచ్చని తెలిపారు. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అవసరం అని, మాంసం ద్వారా ప్రొటీన్లు శరీరానికి అందుతాయని పేర్కొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close