టాప్ స్టోరీస్టెక్నాలజీబ్రేకింగ్ న్యూస్

వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌

మార్కెట్‌లో జియో పోటీ నుంచి తట్టుకుని.. జియోకు షాక్‌ ఇచ్చేలా ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌, వోడాఫోన్‌ ఇండియా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా టీవీ, వీడియో సర్వీసులను ఉచితంగా అందించే ప్రణాళికలో అమెజాన్‌ ప్రైమ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని వోడాఫోన్‌ రెడ్‌పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకు రూ. వెయ్యి విలువైన ఆమెజాన్‌ ప్రీమియా వీడియో ఆఫర్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ వోడాఫోన్‌ రెడ్‌ప్లాన్‌ రూ. 399 నుంచి ప్రారంభించింది.

వోడాఫోన్‌ రెడ్‌ పోస్ట్‌ పెయిడ్‌ అప్‌గ్రేడ్‌ చేసుకున్న కస్టమర్లకు రూ. వెయ్యి విలువైన అమెజాన్‌ ప్రైమ్‌ ఉచిత చందాను అందిస్తోంది. అయితే కస్టమర్లు వోడాఫోన్‌ ప్లే యాప్‌ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.  వేలకొద్ది సినిమాలు, వీడియోలు, టీవీ షోలు , మ్యూజిక్‌లాంటి 999 రూపాయల విలువైన ప్రీమియం సేవలను వోడాఫోన్‌ రెడ్‌ పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నామని అమెజాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మా భాగస్వామ్యంతో కస్టమర్లకు విలువైన సేవలు అందించనున్నామని వోడాఫోన్‌ ఇండియా డైరెక్టర్‌ అవనీష్‌ ఖోస్లా తెలిపారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close