సినిమా

మళ్లీ తెరపైకి వచ్చిన బన్నీ ‘ఐకాన్’

  • గతంలోనే ఎనౌన్స్ చేసిన ‘ఐకాన్’
  • కొన్ని కారణాల వలన పట్టాలెక్కని ప్రాజెక్టు
  • బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపిన ‘దిల్’ రాజు

అల్లు అర్జున్ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన ‘పుష్ప’ సినిమాను గురించి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో వాళ్లంతా ‘ఐకాన్’ ప్రాజెక్టును గురించి మాట్లాడుకుంటున్నారు. బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమాను చేయడానికి ముందు, ఆయనకి వేణుశ్రీరామ్ ఒక కథను వినిపించాడు. బన్నీకి నచ్చడంతో ‘దిల్’ రాజు నిర్మాతగా ఈ  సినిమాకి ‘ఐకాన్’ అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు .. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఎనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత  ఈ ప్రాజెక్టు ఊసులేదు. వాయిదా పడిందనీ .. మొత్తానికే రద్దయిందనే వార్తలు షికారు చేశాయి.

అయితే ఇటీవల ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన వేదికపై సుకుమార్ మాట్లాడుతూ, ఇకపై బన్నీ ‘ఐకాన్’ స్టార్ అంటూ ఎనౌన్స్ చేశాడు. దాంతో ఆల్రెడీ ‘ఐకాన్’ టైటిల్ తో ఒక సినిమాను ఎనౌన్స్ చేశారు గదా అనే విషయం చాలామందికి గుర్తుకు వచ్చింది. తాజాగా దిల్ రాజు – వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వచ్చిన ‘వకీల్ సాబ్’ భారీ విజయాన్ని సాధించింది. దాంతో ‘ఐకాన్’ ఉన్నట్టా లేనట్టా? అనే ప్రశ్న బన్నీ అభిమానుల నుంచి వాళ్లకి ఎదురైంది. అందుకు ‘దిల్’ రాజు స్పందిస్తూ ‘ఐకాన్’ ప్రాజెక్టు ఉందని చెప్పారు. దాంతో ఇప్పుడు అందరి నోళ్లలో ‘ఐకాన్’ టైటిల్ నానుతోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి మరి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close