క్రైమ్టాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్

మోడీ హత్య కేసులో వరవరరావు అరెస్ట్‌

పూణేలో బయపడ్డ మోడీ హత్య కుట్ర కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఇవాళ ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టు సానుభూతి పరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని
విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఇంట్లోనూ దాదాపు ఏడు గంటల పాటు సోదాలు చేసిన పోలీసులు, చివరకు ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఈరోజు ఉదయం నుంచి పుణె పోలీసులు ఆయనతో పాటు కుమార్తెల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. పూణే పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని లేఖల్లో రోడ్‌షోలకు వచ్చినప్పుడు ప్రధానిని హత్య చేయవచ్చంటూ రాసి ఉండడం కలకలం రేపింది. వీటిల్లోనే వరవరరావు సహా మరికొంతమంది మద్దతును తీసుకోవచ్చంటూ పేర్కొన్నారు. దీంతో, పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం తెల్లవారుజామునే, హైదరాబాద్‌ పోలీసుల సాయంత ఆయన నివాసంలో సోదాలు మొదలుపెట్టింది. వరవరరావుతో పాటు, ఆయన కుమార్తెలు, స్నేహితుల నివాసాల్లో సోదాలు చేశారు. సోదాలు ముగిసిన తర్వాత ఆయన్ని అరెస్ట్‌ చేశారు.

వరవరరావు అరెస్ట్‌ను మానవ హక్కుల సంఘాలు, విరసం నేతలు ఖండించారు. కేవలం ఓ లేఖలో పేరు ఉందన్న కారణంతో అరెస్ట్ చేయడం సరికాదన్నారు. మోడీ సర్కార్‌ మానవహక్కుల ఉద్యమకారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. వరవరరావును తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close