రాజకీయం

ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా

  • 2018లో గవర్నర్ గా బాధ్యతల స్వీకరణ
  • ఇంకో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా
  • రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించిన బేబీ రాణి మౌర్య

ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి బేబీ రాణి మౌర్య రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకో రెండేళ్లు ఉండగానే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. వ్యక్తిగత కారణాలతోనే ఆమె రాజీనామా చేసినట్టు రాజ్ భవన్ కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఆమె పంపించినట్టు సదరు అధికారి వెల్లడించారు. 2018 ఆగస్టు 26న ఆమె ఉత్తరాఖండ్ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పాల్ పదవీకాలం ముగియడంతో బేబీ రాణిని కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించింది. గత నెలలో గవర్నర్ గా ఆమె మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close