అంతర్జాతీయంటాప్ స్టోరీస్

భారత్‌కు ఎప్పుడెప్పుడా..

భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తన పర్యటన సందర్భంగా భారత్‌, అమెరికా ఒక వాణిజ్య ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కూడా వెళ్లనున్న ట్రంప్‌.. అక్కడ కొత్తగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోదీతో కలిసి పాల్గొననున్నారు.

  • ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న ట్రంప్‌
  • గుర్తుండిపోయే స్వాగతం పలుకుతాం: మోదీ
  • అహ్మదాబాద్‌లో భారీ రోడ్‌షోకు సన్నాహాలు

భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తన పర్యటన సందర్భంగా భారత్‌, అమెరికా ఒక వాణిజ్య ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కూడా వెళ్లనున్న ట్రంప్‌.. అక్కడ కొత్తగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోదీతో కలిసి పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్ష నివాసం శ్వేత భవనం వద్ద మంగళవారం రాత్రి ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ, మోదీ గొప్ప వ్యక్తి అని, భారత్‌కు వెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. భారత్‌తో సరైన ఒప్పందం చేసుకోగలిగితే.. తాను దానిపై సంతకం చేస్తానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. మరోవైపు ట్రంప్‌ భారత పర్యటన మోదీతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం అని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌సింగ్‌ సంధూ చెప్పారు. గత ఏడాది ఇద్దరు నేతలు నాలుగుసార్లు కలుసుకున్నారు. 

50వేల మంది భారత అమెరికన్లతో అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన సభలో ఇద్దరు నేతలు పాల్గొన్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ ఏడాది ట్రంప్‌, మోదీ రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ‘మోదీతో మాట్లాడాను. అహ్మదాబాద్‌లో వేల మంది భారతీయులు నాకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ చెప్పారు. అమెరికాలో 40వేల నుంచి 50వేల మంది మధ్యలో మాట్లాడాను. భారత్‌లో కూడా అదే సంఖ్యలో జనం వస్తే నాకు నచ్చదు’ అంటూ ట్రంప్‌ సరదాగా వ్యాఖ్యానించారు. ‘లక్షల సంఖ్యలో జనం వస్తారని మోదీ చెప్పారు. విమానాశ్రయం నుంచి కొత్త స్టేడియం వరకు 50 లక్షల నుంచి 70 లక్షల మంది నాకు స్వాగతం పలుకవచ్చు. ఆ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది. మోదీ ఇప్పుడు దానిని నిర్మిస్తున్నారు’ అని ట్రంప్‌ చెప్పారు. అహ్మదాబాద్‌లో ఇటీవలే మోతెరా స్టేడియాన్ని రూ.70 కోట్లతో నిర్మించారు. ఈ స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు కూర్చోవుచ్చు. 


మన స్నేహం ఉపయోగకరం : మోదీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ ఈ నెలాఖరులో భారత్‌ వస్తున్నారని, వారికి ‘చిరస్మరణీయ స్వాగతం’ పలుకుతామని ప్రధాని మోదీ తెలిపారు. మోదీ ట్విట్టర్‌ వేదికగా బుధవారం స్పందిస్తూ, ‘ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి భారత్‌, అమెరికా కట్టుబడి ఉన్నాయి. అనేక అంశాలపై ఉభయ దేశాలు విస్తారంగా సహకరించుకుంటున్నాయి. తమ మధ్య స్నేహం ఉభయ దేశాలకే కాకుండా ప్రపంచమంతటికీ ఉపయోగకరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం తరహాలో అహ్మదాబాద్‌లో ఓ భారీ రోడ్‌షోకు సన్నాహాలు జరుగుతున్నాయి. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న ట్రంప్‌ ఆ తర్వాత కొత్తగా నిర్మించిన మోతెరా క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభిస్తారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close