అంతర్జాతీయం

కోవిడ్ చికిత్స‌.. రెమ్‌డిసివిర్‌కు ఓకే చెప్పేసిన అమెరికా

నోవెల్ క‌రోస్ చికిత్స కోసం రెమ్‌డిసివిర్ ఔష‌ధానికి అమెరికా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  ఎబోలా వ్యాధి చికిత్స‌లో ఈ డ్ర‌గ్‌ను వినియోగిస్తున్నారు. తీవ్ర‌మైన కోవిడ్19 ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి రెమ్‌డిసివిర్ యాంటీ వైర‌ల్ ఔష‌ధాన్ని ఇచ్చేందుకు అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఈ డ్ర‌గ్ ఇవ్వ‌డం వ‌ల్ల వాళ్లు తొంద‌ర‌గా కోలుకున్న‌ట్లు ఎఫ్‌డీఏ గుర్తించింది.  కానీ రెమ్‌డిసివిర్‌ను సునిశితంగా ప‌రిశీలించ‌నున్న‌ట్లు ఎఫ్‌డీఏ చెప్పింది. ఎబోలా వ్యాధి చికిత్స కోసం గిలీడ్ ఫార్మ‌సీ కంపెనీ ఈ ఔష‌ధాన్ని ఉత్ప‌త్తి చేసింది. కానీ దీన్ని మ్యాజిక్ బుల్లెట్‌గా చూడ‌కూడ‌ద‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు. గిలీడ్ కంపెనీ సుమారు 15 ల‌క్ష‌ల ఔష‌ధాల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ఆ సంస్థ సీఈవో డానియ‌ల్‌.. అధ్య‌క్షుడు ట్రంప్‌కు వెల్ల‌డించారు.  ఎఫ్‌డీఏ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ హ‌న్ కూడా ఎబోలా డ్ర‌గ్‌కు ఓకే చెప్పేశారు.  కోవిడ్‌19 చికిత్స కోసం ఇది తొలి ఆమోదిత ఔష‌ధ‌మ‌న్నారు. దీని ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

అమెరికాలో జరిగిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు బుధవారం విడుద‌లయ్యాయి. ఈ మందు చాలా స్ఫష్టమైన పనితీరును కనబరిచినట్టు ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త ఆంథొనీ ఫాచీ వ్యాఖ్యానించారు. కేవలం ప్రథామిక చికిత్స తీసుకున్న కరోనా రోగులతో పోలిస్తే.. రిమ్‌డిసివిర్ తీసుకున్న వారు 30 శాతం తొందరగా కోలుకున్నట్టు ఈ అధ్యయనంలో బయటపడిందన్నారు. అమెరికా అంటు వ్యాధుల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగడం గమనార్హం.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close