తెలంగాణరాజకీయం

అటవీ శాఖ పోలీసులకు సరికొత్త బైక్లు

క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్థించేందుకు తమ సిబ్బందికి తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సరికొత్త టూ వీలర్లను అందించింది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న అటవీ భూములను రక్షించేందుకు సిబ్బందికి ఈ వాహనాలను సమకూర్చినట్లు సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తెలిపారు.

నిత్యం పర్యవేక్షణతోపాటు అటవీ అభివృద్ధి సంస్థ చేపట్టిన ప్లాంటేషన్‌ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి ఆయన సూచించారు. డిప్యూటీ, అసిస్టెంట్ ప్లాంటేషన్ మేనేజర్లుగా పనిచేస్తున్న 36 మందికి ఈ ద్విచక్ర వాహనాలను అందించారు. ఈ సిబ్బంది రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పని చేస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close