అంతర్జాతీయంక్రైమ్

గ్రీన్‌జోన్‌పై ఇరాన్ రాకెట్ల దాడి

ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావ‌రాల‌పై మిస్సైల్ దాడి చేసిన మ‌రుస‌టి రోజు ఇరాన్ మ‌రోసారి రెండు రాకెట్ల‌ను ఫైర్ చేసింది. బ‌గ్దాద్‌లో ఉన్న గ్రీన్‌జోన్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ రెండు రాకెట్ల‌తో దాడికి పాల్ప‌డింది. గ్రీన్‌జోన్‌లోనే అమెరికా దౌత్య కార్యాల‌యం ఉన్న‌ది. గ్రీన్‌జోన్‌లో రెండు క‌త్యూషా రాకెట్లు ప‌డిన‌ట్లు ఇరాక్ సైన్యం వెల్ల‌డించింది. గ్రీన్‌జోన్ ప్రాంతంలో అమెరికాతో పాటు ఇత‌ర పాశ్చాత్య దేశాల దౌత్య కార్యాల‌యాలు ఉన్నాయి. అయితే ఆ రాకెట్ల వ‌ల్ల ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గలేద‌ని తెలుస్తోంది. కానీ రాకెట్లు టార్గెట్‌ను పేల్చిన స‌మ‌యంలో భారీ శ‌బ్ధాలు వినిపించాయి. అమెరికాతో స‌మ‌రానికి దిగేందుకు ఇరాన్ వెనుకాడుతుంద‌ని ట్రంప్ కామెంట్ చేసిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే గ్రీన్‌జోన్‌పై రాకెట్ల దాడి జ‌రిగింది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close