అంతర్జాతీయంటాప్ స్టోరీస్

త‌లలు అతుక్కొని పుట్టిన క‌వ‌ల‌ల‌కు విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

జెరుస‌లెం: పైన ఉన్న ఫొటో చూశారు క‌దా. వీళ్లిద్ద‌రూ క‌వ‌ల‌లు. ఈ భూమిపైకి వ‌చ్చి ఏడాదైనా వాళ్లు తొలిసారి ఒక‌రినొక‌రు చూసుకున్నారు. కార‌ణం.. ఇన్నాళ్లూ వాళ్ల త‌ల‌లు అతుక్కొని ఉండ‌ట‌మే. ఈ క‌వ‌ల‌లు పుట్ట‌డ‌మే అలా పుట్టారు. ఏడాదిగా ఈ ఇద్ద‌రి త‌ల‌ల వెనుక భాగాలు క‌లిసే ఉన్నాయి. స‌ర్జ‌రీకి ముందు వాళ్ల ప‌రిస్థితి ఎలా ఉందో కింద ఉన్న మ‌రో ఫొటోలో మీరు చూడ‌వ‌చ్చు. మొత్తానికి ఏడాది త‌ర్వాత డాక్ట‌ర్లు 12 గంట‌ల పాటు స‌ర్జ‌రీ చేసి విజ‌య‌వంతంగా వేరు చేశారు.

ఎప్పుడు? ఎక్క‌డ‌?

ఈ స‌ర్జ‌రీకి 12 గంట‌లు ప‌ట్టినా.. దాని వెనుక కొన్ని నెల‌ల ప్రిప‌రేష‌న్ ఉంది. ప‌దుల సంఖ్య‌లో డాక్ట‌ర్లు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఇజ్రాయెల్‌లోని బీర్షెబా న‌గ‌రంలోని సొరోకా మెడిక‌ల్ సెంట‌ర్‌లో గ‌త వారం ఈ స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. ఈ ఇద్ద‌రు పాప‌లు ఇప్పుడు వేగంగా కోలుకుంటున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. కృత్రిమ శ్వాస అవ‌స‌రం రాలేద‌ని, సొంతంగానే తిన‌గ‌లుగుతున్నార‌నీ సొరోకా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎల్డాడ్ సిల్బ‌ర్‌స్టీన్ చెప్పారు.

చాలా అరుదైన సర్జ‌రీ

ఇది చాలా అరుదైన స‌ర్జ‌రీ. ఇప్పటి వ‌ర‌కూ ప్ర‌పంచంలో కేవ‌లం 20సార్లు మాత్ర‌మే చేశారు. ఇజ్రాయెల్‌లో ఇదే తొలి ఆప‌రేష‌న్‌. ఈ స‌ర్జ‌రీకి కొన్ని నెల‌ల ముందు గాలితో నిండిన సిలికాన్ బ్యాగ్‌ల‌ను వాళ్ల త‌ల‌ల్లో అమ‌ర్చారు. వాళ్ల చ‌ర్మాన్ని కాస్త సాగ‌దీయ‌డానికి ఇలా చేశారు. స‌ర్జ‌రీలో భాగంగా ఇద్ద‌రి పుర్రెల‌ను వేరు చేసిన త‌ర్వాత కొత్త చ‌ర్మంతో దానిని సీల్ చేశారు. ఈ స‌ర్జ‌రీ కోసం ముందుగా ఈ క‌వ‌ల‌ల 3డీ వ‌ర్చువ‌ల్ రియాల్టీ మోడ‌ల్‌ను కూడా సృష్టించిన‌ట్లు సొరోకా చీఫ్ న్యూరోస‌ర్జ‌న్ మిక్కీ గిడియోన్ వెల్ల‌డించారు. తాము ఎలా అయితే ప్లాన్ చేశామో.. అంతా అలా సాఫీగా జ‌రిగిపోయింద‌ని ఆయ‌న అన్నారు. గ‌తేడాది ఆగ‌స్ట్‌లో జ‌న్మించిన ఈ క‌వ‌ల‌లు భ‌విష్య‌త్తులో పూర్తి సాధార‌ణ జీవితం గ‌డ‌ప‌నున్న‌ట్లు డాక్ట‌ర్లు చెబుతున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close