క్రైమ్
ఇరాక్‌లో సూసైడ్ ఎటాక్స్.. ఏడుగురు మృతి

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో గురువారం సూసైడ్ ఎటాక్స్ జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా సుమారు 30 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ బాగ్దాద్‌లోని తాయరన్ స్క్వేర్‌లో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద గురువారం ఇద్దరు వ్యక్తులు తమను తాము బాంబులతో పేల్చుకున్నాడు. జంట ఆత్మాహుతి దాడుల్లో ఏడుగురు మరణించగా 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని, దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.