టాప్ స్టోరీస్తెలంగాణ

ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయం సోషల్‌ మీడియా -కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని పేర్కొన్నారు. ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్‌ మీడియా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో 11 లక్షలు, ట్విట్టర్‌లో 3.6 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారని కేటీఆర్‌ తెలిపారు. చెప్పదలుచుకున్నది ప్రజలకు నేరుగా చెప్పడానికి సోషల్‌ మీడియా చక్కని వేదిక అని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై అభిమానంతో ఉద్యమ కాలం నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సైనికులు స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. తిమ్మినిబమ్మిని చేయడంలో విపక్షాలు సిద్ధహస్తులు అని ఎద్దెవా చేశారు. కొన్ని పార్టీలు పెయిడ్‌ వర్కర్స్‌తో సోషల్‌ మీడియాలో పని చేయిస్తున్నాయి.
మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థుల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రజల నాడి తెలుసుకునేందుకు సోషల్‌ మీడియా మంచి సాధనం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హుజుర్‌నగర్‌ ఎన్నికల సమయంలో ఇష్టారీతిన దుష్ప్రచారం చేశారు. హుజుర్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు అని కేటీఆర్‌ గుర్తు చేశారు. పరుషమైన పదజాలం వాడకుండా.. సమర్థవంతమైన సబ్జెక్ట్‌తో తిప్పికొట్టాలి. ఇప్పుడు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 16 లక్షల మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్నారు. వీళ్లందరిని సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ చేయాలి. మహిళలు తమ నివాసాల ముందు కారు గుర్తు ముగ్గులు వేసుకుంటున్నట్లు.. పతంగులపై కేసీఆర్‌ బొమ్మలు ఉండేలా చూడాలని సూచించారు. వినూత్నమైన ప్రచారంతో.. ప్రజలకు దగ్గరై.. ప్రత్యర్థులకు టీఆర్‌ఎస్‌ దెబ్బ చూపించాలి అని కేటీఆర్‌ సూచించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాకు ఇంఛార్జిగా క్రిశాంక్‌, దినేష్‌, జగన్‌, సతీష్‌లను కేటీఆర్‌ నియమించారు.

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close