తెలంగాణ

ప్ర‌జ‌ల అంచ‌నాల మేర‌కు ప‌నిచేస్తాం -మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌

హైద‌రాబాద్ : కొత్తూరు, జ‌డ్చ‌ర్ల‌ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి ఘ‌న విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. పార్టీకి విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాల‌న్నారు.

అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కున్న విశ్వాసానికి ఈ ఫ‌లితాలు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సీఎం కేసీఆర్‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌జ‌ల అంచ‌నాల మేర‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను టీఆర్ఎస్‌ 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల్లో టీఆర్ఎస్ 23 స్థానాలను కైవ‌సం చేసుకుంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close