అంతర్జాతీయం

అడవికి రక్షకులు

  • అమెజాన్‌లో సైన్యంలా ఏర్పడిన ఆదివాసీ తెగ
  • ప్రాజెక్టులు, మైనింగ్‌, స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా పోరు

ఆల్టో రియో: అమెజాన్‌ అడవులు భూమికి ఊపిరితిత్తులు. ప్రపంచానికి అవసరమైన ఆక్సిజన్‌లో 20 శాతం ఈ అడవుల నుంచే వస్తున్నది. కానీ అభివృద్ధి పేరుతో మనుషులు ఈ ఊపిరితిత్తుల్లో మంట పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లోని పారా రాష్ట్రంలోని స్థానిక ఆదివాసీ తెగ అడవి తల్లిని రక్షించుకోవడానికి నడుం కట్టింది. ఆల్టో రియో గ్వామా ప్రాంతంలోని తెంబే తెగ యువకులు తమకు తామే ఒక సైన్యంలాగా తయారయ్యారు. తుపాకీ చేతపట్టారు. అడవి రక్షకుల పేరుతో గస్తీ కాస్తున్నారు. పొద్దున్నే లేచి బైక్‌లు వేసుకొని అడవిలోకి వెళ్తారు. స్మగ్లర్లు అడవిలోకి అక్రమంగా ప్రవేశించినా, చెట్లు కొట్టినా వారిని దండిస్తారు. కేవలం 1700 మంది జనాభా ఉండే గ్వామాలో వంతుల వారీగా అడవిని రక్షిస్తారు. ప్రభుత్వాలు మైనింగ్‌, ఇతర ప్రాజెక్టులకు అనుమతిచ్చినా ఎదురొడ్డి పోరాడుతారు.

3వేల కిలోమీటర్ల అడవి మాయం: బ్రెజిల్‌లో గడిచిన ఒక్కసంవత్సరంలోనే 2,800 చదరపు కిలోమీటర్ల అడవి అంతరించింది. దీనికి తోడు పెద్ద ఎత్తున కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. 2019లో అమెజాన్‌ అడవుల్లో 73వేల సార్లు మంటలు వ్యాపించినట్టు బ్రెజిల్‌ స్పేస్‌ రీసెర్చి సెంటర్‌ గుర్తించింది. కొంతమంది అటవీ ప్రాంతాలను ఆక్రమించుకోవడం కోసం కావాలనే నిప్పు పెడుతున్నారు. 

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close