జాతీయం

ప్ర‌త్యేక విమానాల్లో 3వేల మంది బ్రిట‌న్ దేశ‌స్థుల త‌ర‌లింపు

హైద‌రాబాద్‌: భార‌త్‌లో చిక్కుకుపోయిన మూడు వేల మంది బ్రిట‌న్ దేశ‌స్థుల‌ను తీసుకువెళ్లేందుకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.  దీని కోసం ఏడు విమానాల‌ను రెడీ చేసిన‌ట్ల బ్రిట‌న్ అధికారులు వెల్ల‌డించారు. దీంతో లాక్‌డౌన్ స‌మ‌యంలో భార‌త్ నుంచి బ్రిట‌న్‌కు తీసుకువెళ్లిన ఆ దేశ‌స్థుల సంఖ్య 5వేల‌కు చేరుకుంటుంది. భార‌త్‌లో వేరువేరు ప్రాంతాల్లో చిక్కుకున్న బ్రిట‌న్ దేశ‌స్తుల‌ను మొద‌ట ఒక ద‌గ్గ‌రికి చేర్చి, ఆ త‌ర్వాత వారిని ప్ర‌త్యేక విమానాల్లో బ్రిట‌న్‌కు తీసుకువెళ్తార‌ని ద‌క్షిణాసియా కామ‌న్‌వెల్త్ అధికారి లార్డ్ తారిక్ అహ్మ‌ద్ తెలిపారు. 

క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు మార్చి 24వ తేదీన ప్ర‌ధాని మోదీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో.. చాలా దేశాల‌కు చెందిన టూరిస్టులు ఇక్క‌డే చిక్కుకుపోయారు. వారంద‌రినీ త‌ర‌లించేందుకు ఆయా దేశాల ఎంబ‌సీల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంప‌ద్రింపులు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ ఉన్నా.. ఆ ఆంక్ష‌ల‌ను మ‌రింత పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో బ్రిట‌న్ దేశ‌స్థుల‌ను వారి దేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close