క్రైమ్

తాలిబన్ల దాడిలో ముగ్గురు ఆప్ఘన్‌ సైనికుల మృతి

కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు శుక్రవారం జరిపిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు ఆప్ఘన్‌ సైనికులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని హెల్మాండ్‌ జాతీయ రహదారితోపాటు నహ్రీ సరాజ్‌ జిల్లాలో ఈ దాడులు జరిగినట్లు హెల్మాండ్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి ఒమర్‌ జ్వాక్‌ తెలిపారు. దాడులకు కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అంతర్-ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడికి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరుగుతున్నా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close