అంతర్జాతీయం

రోడ్డు మీద వారికి ఏడున్నర కోట్లు దొరికాయి

వర్జీనియా: అమెరికాలోని వర్జీనియాలో కరోనా లాక్‌డౌన్‌తో విసుగెత్తిపోయి డేవిడ్, ఎమిలీ షాంజ్ దంపతులు తమ పిల్లలతో కలిసి కారులో సరదాగా రోడ్డు మీదకు వచ్చారు. అలా అలా తాజా గాలి పీల్చుకుంటూ, ప్రకృతి సోయగాల్ని ఆస్వాదించుకుంటూ ముందుకు సాగుతుంటే రోడ్డు మీద వారికి ఓ బ్యాగు లాంటిది కనిపించింది. ముందు అది చెత్త కవరు అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే కొత్త బ్యాగు. పక్కనే ఇంకో బ్యాగు కూడా కనిపించింది. అటూఇటూ వెదికితే ఎవరూ కనిపించలేదు. కారు వెనుక రెండు బ్యాగులు వేసుకుని ఇంటిదారి పట్టారు. ఇంటికి చేరుకున్నాక బ్యాగులను తెరచి చూస్తే కళ్లు మిరుమిట్లు గొల్పాయి. రెండు బ్యాగుల నిండా క్యాషే. కరకరలాడే కొత్త డాలర్లు. లెక్కచూస్తే మిలియన్ అంటే పదిలక్షల డాలర్లుగా తేలింది. మన కరెన్సీలో అయితే ఏడున్నర కోట్లు. క్యాష్ వాల్ట్ అని రాసిన ఓ కాగితం కూడా బ్యాగుల్లో ఉంది. షాంజ్ దంపతులు వంటనే కరోలిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి ఫోన్ చేసి సంగతి తెలిపారు. ఇద్దరు పోలీసులు వచ్చి సంచులను పరిశీలించి డబ్బు లెక్కపెట్టుకున్నారు. మిలియన్ డాలర్లు ఉన్నట్టు నిర్ధారించారు. షెరీఫ్ మీడియాతో మాట్లాడుతూ ఆ సొమ్ము అసలు యజమానులు ఎవరో తెలిసిందని చెప్పారు. అయితే పేరు బయటపెట్టలేదు. వారు తమ సొమ్ము తమకు దొరికినందుకు షాంజ్ కుటుంబానికి మంచి బహిమతి ఇస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అంత సొమ్ము కనిపిస్తే బుద్దిగాల పోలీసులకు సమాచారం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close