టాప్ స్టోరీస్బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌ : కొత్త రకం వైరస్‌ భయాలు స్టాక్‌మార్కెట్లను తాకాయి. యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా ఉద్దీపనపైనా మదుపరులకు నమ్మకం కుదరకపోవడంతో నష్టాలకు తోడైంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచి సెన్సెక్స్‌ 1200 పాయింట్లకుపైగా నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 450 పాయింట్ల నష్టాల్లో ఉంది. ఒక దశలో రెండువేల పాయింట్లు సెన్సెక్స్‌ నష్టపోయింది. బ్రిటన్‌పై ఆంక్షల నేపథ్యంలో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీన పడింది. కరోనా కొత్త వేరియంట్‌ నేపథ్యంలో యూకేపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు 4 శాతానికి పైగా పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్ 2037.61 పాయింట్లు (4.34 శాతం) పడిపోయి 44,923.08కు చేరింది. నిఫ్టీ బెంచ్‌మార్క్‌ 13,131.45 పాయింట్లకు చేరి.. 629.1 పాయింట్లు (4.57 శాతం) నష్టపోయింది. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆటో మొబైల్‌, మెటల్‌ షేర్లపై అధిక ప్రభావం ఉంది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close