తెలంగాణ

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

వరంగల్ రూరల్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ అన్నారు. వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు రుణ మాఫీ, రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికల నిర్మాణం, వంటి అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

రైతులు ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసి మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేష్ కన్నా, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, స్థానిక సర్పంచ్ భూక్యా సరోజన మంగ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close