అంతర్జాతీయంటాప్ స్టోరీస్

బౌద్ధ బిక్షవులుగా మారిన థాయ్‌ పిల్లలు

థాయ్‌ లోని లువాంగ్ గుహలో తొమ్మిది రోజులు ఆహారం లేకుండా బతికి…భారీ ఆపరేషన్‌ ద్వారా బయటకు వచ్చిన థాయ్‌ పిల్లలు…ఇప్పుడు బౌద్ధ బిక్షువుల దీక్ష చేపట్టారు. బౌద్ధ సన్యాసులు ఏ విధంగా అయితే ఉంటారో..అచ్చం అలాగే…ఈ పిల్లలు తొమ్మిది రోజులు దీక్ష చేపడతారు. ఈ దీక్ష చేపట్టడానికి కారణం లేకపోలేదు.

ఎవరైనా అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం లేదా చావు దగ్గరవరకు వెళ్లి వచ్చినవారు ఈ దీక్ష చేపడుతుంటారు. ఈ ఫుట్‌బాల్‌ థాయ్‌ పిల్లలు గుహ నుంచి బయటకు రావటం కూడా అద్భుతం. అందుకే ఈ పిల్లలకు బౌద్ధ దీక్షకు పంపించారు తల్లిదండ్రులు. ఈ దీక్ష అచ్చం బౌద్ధ సన్యాసుల వలే ఉంటుంది. తొమ్మిది రోజులు చేయాలి. గుండు చేస్తారు. వస్త్రధారణ కూడా సన్యాసుల వలే ఉంటుంది. గుడిలోనే ఉండి సేవలు చేస్తారు. వీరికి జ్ఞానబోధ ఉంటుంది. మత గురువులు ధ్యానం నేర్పిస్తారు. బిక్షవులు ఎలాంటి నియమాలు పాటిస్తారో..అలాగే వీరు కూడా చేస్తారు. ఆ తర్వాత యథావిధిగా జనజీవన స్రవంతిలోకి వస్తారు.

 

ఫుట్ బాల్ టీంలోని 11 మంది దీక్ష చేపట్టారు. ఒక్క చిన్నారి మాత్రం క్రిస్టియన్ కావటంతో రాలేదు. గుహలో తొమ్మిది రోజుల ఆహారం లేకుండా..పగలు, రాత్రి తేడా లేకుండా ఎంతో ధైర్యంగా ఉండటానికి కారణం ధ్యానం అంటారు పిల్లలు. కోచ్ చెప్పిన ధైర్యం, ధ్యానం వల్లే శరీరంలోని శక్తిని ఉపయోగించుకుంటూ బతికాం అని పిల్లలు వెల్లడించారు. ఆ పిల్లలే ఇప్పుడు దీక్ష తీసుకోవటంతో.. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. థాయ్ లోని ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ కూడా చేశాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close