జాతీయం

సైనిక శిబిరాలపై దాడికి ఉగ్రవాదుల కుట్ర..

శ్రీనగర్: భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కశ్మీర్‌తో పాటు జమ్మూలో కూడా అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లో సైనిక శిబిరాలపై ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26కి ముందే దాడులకు దిగేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్టు సమాచారం. పుల్వామాలోని ఆపిల్ తోటల్లో 8 మంది ఉగ్రవాదులు ఇప్పటికే సమావేశమైనట్టు నిఘావర్గాలు గుర్తించాయి. 8 మంది ఉగ్రవాదుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దళాలుగా ఉన్నట్లు సమాచారం. జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ఉగ్రవాదుల మధ్య సమావేశం జరిగినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. షోపియాన్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు సమాచారం అందడంతో కేంద్ర హోంశాఖ ఆర్మీ, భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close