క్రైమ్

ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు

శ్రీనగర్‌ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లా వాన్‌పో ప్రాంతంలో ఉదయం జవాన్ల పెట్రోలింగ్‌ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయని ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన నలుగురు జవాన్లను చికిత్స నిమిత్తం 92 బేస్‌ దవాఖానకు తరలించారు. అదనపు భద్రతాదళాలు ఘటనాస్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close