క్రీడలు

నాలుగో టెస్టు: లంచ్ వేళకు ఇంగ్లండ్ స్కోరు 139-5

  • లండన్ లో భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు
  • 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
  • 3 వికెట్లతో రాణించిన ఉమేశ్ యాదవ్ 
  • ఆదుకున్న పోప్, బెయిర్ స్టో

లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. లంచ్ సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆతిథ్యజట్టును ఓల్లీ పోప్ (38 బ్యాటింగ్), జానీ బెయిర్ స్టో (34 బ్యాటింగ్) జోడీ ఆదుకుంది.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 53-3తో రెండో రోజు ఆట షురూ చేసిన ఇంగ్లండ్ వెంటవెంటనే మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. ఈ రెండు వికెట్లు ఉమేశ్ యాదవ్ ఖాతాలోకి వెళ్లాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. పేసర్లకు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై భారత్ తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌటైంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close