క్రీడలుటాప్ స్టోరీస్

దారుణంగా ఓడిపోయిన టీమిండియా… సెమీస్ అవకాశాలు సంక్లిష్టం

  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్
  • 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జయభేరి
  • 49 పరుగులు సాధించిన కివీస్ ఓపెనర్ మిచెల్
  • బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన భారత ఆటగాళ్లు

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. సూపర్-12 దశ మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన భారత్… తాజాగా న్యూజిలాండ్ చేతిలోనూ భంగపడింది. దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ పై కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. భారత్ విసిరిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే ఛేదించారు.

ఓపెనర్ డారిల్ మిచిల్ 49 పరుగులు చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్) తనదైన శైలిలో ఇన్నింగ్స్ నడిపించాడు. డారిల్ మిచెల్ స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 20 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత మిచెల్, విలియమ్సన్ జోడీ స్కోరు బోర్డును ముందుకు ఉరికించారు. మిచెల్ అవుటైనా… కాన్వేతో కలిసి విలియమ్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. చాన్నాళ్ల తర్వాత బౌలింగ్ వేసిన హార్దిక్ పాండ్య ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన భారత్ కు, ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close