ఆంధ్రక్రైమ్టాప్ స్టోరీస్రాజకీయం
బుద్దా వెంకన్న, బోండా ఉమ కార్లపై వైసీపీ శ్రేణుల దాడి

గుంటూరు: మాచర్లలో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. టీడీపీ ముఖ్య నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న కార్లను అడ్డగించిన వైసీపీ వర్గీయులు వాటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వైసీపీ కార్యకర్తలు తమ వెంటపడ్డారని బోండా ఉమ వెల్లడించారు. నిన్న మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు.
