ఆంధ్రక్రైమ్టాప్ స్టోరీస్

శవాలమయ్యే వాళ్లం

  • 2 నిమిషాల వ్యవధిలో బతికిపోయాం
    మా కారు ఎవరినీ ఢీ కొట్టలేదు
  • వైసీపీ నేతలవి పచ్చి అబద్ధాలు
  • చంపేందుకు పక్కా ప్రణాళిక వేశారు
  • డ్రైవరే కాపాడాడు: బొండా, బుద్దా

 ‘‘మూడు చోట్ల మా రణాయుధాలతో మోహరించారు. మమ్మల్ని చంపేందుకే ప క్కాగా స్కెచ్‌ వేశారు’’ అని టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమా తెలిపారు. మాచర్లలో జరిగిన దాడి అనంత రం బుధవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో, అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో వారు మీడియాతో మా ట్లాడారు. దాడి జరిగిన వైనాన్ని వివరించారు. ‘‘మరో రెండు నిమిషాలు ఇరుక్కుపోయి ఉంటే.. అక్కడే చంపేసేవాళ్లు. శవాలుగా మిగిలేవాళ్లం. మా కారు డ్రైవర్‌ ఏసు.. దేవుడిలా కాపాడాడు’’ అని బొండా ఉమా చెప్పారు. 

పక్కా స్కెచ్‌: బొండా

‘‘మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో నామినేషన్లు వేయకుండా నిరోధించిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు న్యాయవాదులతో కలిసి వెళ్లాం. మేం వస్తున్నామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. పోలీసుల నుంచే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సమాచారం వెళ్లింది. కారంపూడి నుంచే మమ్మల్ని అనుసరించారు. మేం ఎప్పుడెప్పుడు ఏ గ్రామం వస్తున్నామో సమాచారం పంపుకొన్నారు. మాచ ర్ల వచ్చేసరికి మా ముందున్న కారుపై దాడి చేశారు. అందు లో న్యాయవాది కిశోర్‌ను కొట్టారు. అందులో మేం లేమని గుర్తించి.. వెనుక ఉన్న మా కారుపైకి వచ్చారు. సుమారు 30 మంది గుమికూడి కారును చిత్తు చిత్తు చేశారు. లోపలున్న మాపైనా దాడి చేశారు.(గాయాలు చూపించారు) మా డ్రైవ ర్‌ ఏసు చాకచాక్యంగా వాళ్లను తప్పించి ముందుకు తీసుకెళ్లా డు. ముందుకెళ్లాక మళ్లీ అక్కడ ఆపేశారు. ఎమ్మెల్సీ గన్‌మెన్‌ వాళ్లకు గన్‌ చూపిస్తూ వారించినా.. బైక్‌లపైనుంచి రెండువైపులా వచ్చి దాడి చేశారు. ముందుకు వెళ్లాక ట్రాఫిక్‌ జామ్‌ అయితే అక్కడా దాడి చేశారు. మాచర్ల పట్టణ వైసీపీ యూ త్‌  అధ్యక్షుడు, 30మంది గుండాలను పెట్టి దాడి చేయించా రు. మాచర్ల దాటి వెల్దుర్తి వెళ్లాక మమ్మల్ని ఒక పోలీస్‌ వా హనం ఆపింది. డీఎస్పీ మమ్మల్ని వారి కారులో ఎక్కించుకున్నారు. మేం బయటకు కనిపించకుండా పేపర్లు అడ్డుపెట్టా రు.  ‘ముందుకెళితే చంపేస్తారు… ఇటునుంచి ఒంగోలు వె ళ్దాం’ అని అన్నారు. వెల్దుర్తి వెళ్లేసరికి సుమారు రెండొందల మంది మారణాయుధాలు పట్టుకుని ఉన్నారు. గొడ్డళ్లు పట్టుకుని మాపై దాడికి సిద్దమయ్యారు. అది మూడో స్కెచ్‌. అది చివరి పాయింటు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోను చంపేయాల నే ఉన్నారు. పోలీసుల్ని కూడా కొట్టబోయారు. వారి వాహనంపైనా దాడిచేశారు. డీఎస్పీ రివాల్వర్‌ తీసి హెచ్చరించి.. మమ్మల్ని వెనక్కిపంపించారు. మా కారు కూడా వెనక్కిమళ్లించి వచ్చేశాం. అక్కడ రెండు నిమిషాలు ఆగితే… మా ప్రాణాలు పోయేవి. మా వాహనం ఎవరినో ఢీకొట్టిందని, స్థానికులే దాడి చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. వాహనం ఢీకొడుతుందని తెలిసే 30 మంది గూండాలతో సిద్ధంగా ఉన్నారా? మా హత్యను పిన్నెల్లి లైవ్‌లో చూడాలని అనుకున్నాడు. ఫోన్‌లో వీడియో తీయాలని అనుచరులకు చెప్పాడు. ఆయన ఆ సమయంలో ఎక్కడున్నారు? సొంత ఇంట్లో ఉన్నారా? తాడేపల్లిలో ఉన్నారా? దీనికి డీజీపీ కూడా సమాధానం చెప్పాలి. మాకు ప్రాణహాని ఉంది. ఇవాళ తప్పించుకున్నాం. కానీ… ప్రజల కోసం మా ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధం.’’

చంపేందుకే కుట్ర: బుద్దా

‘‘ఈ రోజు జరిగింది మామూలు దాడి కాదు. రాడ్లతో పొడిచారు. మారణాయుధాలతో అడ్డుకున్నారు. మేం చెడు పనికి వెళ్లుంటే శవాలమయ్యేవాళ్లం. కారులో ఉన్న నన్ను దుడ్డుకర్ర తో పొడిచారు. మాపై జరిగిన దాడికి సంబంధించి బొండా ఉమా చెప్పింది అక్షరాలా నిజం. దీనిపై నాకు దైవసమానుడైన చంద్రబాబుపై ప్రమాణం చేస్తున్నా’’

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close