జాతీయంటాప్ స్టోరీస్

సెంట్ర‌ల్ విస్టా ఆపండి.. ఎంపీ ల్యాడ్స్‌ ఇవ్వండి

కోవిడ్ మ‌హ‌మ్మారి మాయం అయ్యేంత వ‌ర‌కు సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్ట‌ను సస్పెండ్ చేయాల‌ని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ స‌తావ్ కోరారు. ఇవాళ రాజ్య‌స‌భ‌లో మంత్రులు, ఎంపీల జీతాల కోత బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు.  కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి ఆ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ స‌తావ్ మాట్లాడుతూ.. బిల్లుకు పూర్తి మ‌ద్దతు ఇస్తున్నామ‌ని, కోవిడ్ నిధికి ఉప‌యోగ‌ప‌డుతుందంటే, కేవ‌లం ఒక రూపాయి తీసుకుని ప‌నిచేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌న్నారు. కానీ ఎంపీ ల్యాడ్స్ నిధుల‌ను నిలిపివేయ‌డం స‌రికాదు అని ఆయ‌న అన్నారు.  దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం హ్యాండిల్ చేస్తున్న తీరును ఆయ‌న ఖండించారు. పీఎం కేర్స్ నిధుల‌కు జ‌వాబుదారీత‌నం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డే ఎంపీ ల్యాడ్స్ నిధుల‌ను పున‌ర్ ప్ర‌వేశ‌పెట్టాల‌న్నారు. కోవిడ్‌19 వెళ్లేవ‌ర‌కు కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం కోసం చేప‌డుతున్న సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును ఆపేయాల‌న్నారు. కోవిడ్ నిధి కోసం ఎంపీలు, మంత్రుల‌ జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు.    

ఎంపీల్యాడ్స్ రిలీజ్ చేయండి..

జీతాల కోత‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని, కానీ ఎంపీ ల్యాడ్స్ నిధుల స‌స్పెన్ష‌న్‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ విశంభ‌ర్ ప్ర‌సాద్ నిషాద్ తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మా జేబుల్లోకి వెళ్ల‌వ‌ని, త‌మ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కే ఆ నిధులు వెళ్తాయ‌ని ఆయ‌న అన్నారు. ఆ నిధులు లేకుంటే, మా చేతుల్ని క‌ట్టేసిన‌ట్లే అని ఆయ‌న తెలిపారు. మ‌హ‌మ్మారి పేరుతో ఎంపీ ల్యాడ్స్ నిధుల‌ను ఆప‌వ‌ద్దు అంటూ వేడుకున్నారు. జీతాల కోత బిల్లుతో ఆదా చేసేది త‌క్కువే అని, పార్ల‌మెంట్‌లో బిల్లులు పాస్ చేసేందుకు అయ్యే ఖ‌ర్చు క‌న్నా త‌క్కువ జీతాల‌తో ఆదా అవుతుంద‌న్నారు. 4 కోట్ల‌ను ఆదా చేసేందుకు ప్ర‌భుత్వం 6 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని ఆరోపించారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల‌పై విధించిన ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌న్నారు.  జీతాల కోత‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, కానీ నిర్ణ‌యం చేసే స‌మ‌యంలో విప‌క్షాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని బెంగాల్ ఎంపీ దినేశ్ త్రివేది కోరారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. జీతాల కోత బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్పారు. కానీ ఎంపీ ల్యాడ్స్ నిధుల‌ను రిస్టోర్ చేయాల‌న్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close