ఆంధ్ర

ప్ర‌తిప‌క్ష పార్టీ కార్యాల‌యాలు, ఇళ్ల‌పై దాడులు మంచిదికాదు -సుజ‌నా చౌద‌రి

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
  • ప్రభుత్వ తీరును  ప్రశ్నించే వారిపై  ఇలా దాడులు చేయ‌డ‌మేంటీ?
  • ఫ్యాక్షనిస్టు భావజాలానికి ఇది నిదర్శనం
  • పోలీసులు చర్యలు తీసుకోవాలి

ఏపీలోని టీడీపీ నేత‌ల ఇళ్లు కార్యాల‌యాల‌పై జ‌రిగిన దాడుల ప‌ట్ల బీజేపీ నేత సుజ‌నా చౌద‌రి మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమ‌ర్శించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన‌ కార్యాలయాలు, నేత‌ల‌ ఇళ్లపై దాడులు జ‌ర‌ప‌డం మంచిదికాద‌ని చెప్పారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారిపై ఇలా దాడులు చేయ‌డం ఫ్యాక్షనిస్టు భావజాలానికి నిదర్శనమని ఆయ‌న చెప్పారు.

ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్ల‌పై దాడులకు తెగ‌బ‌డిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. మ‌ళ్లీ ఇటువంటి దాడులు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ నేత‌ల ఇళ్ల‌పై దాడుల‌ను సీపీఐ నేత రామ‌కృష్ణ కూడా ఖండించారు. రెండేళ్లుగా పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, పోలీసులు చ‌ట్టాన్ని మ‌ర్చిపోయార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close