క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్

ఆత్మాహుతి దాడి..పెషావర్లో 20 మంది మృతి

పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో దాడులు జరగవచ్చన నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరికలు నిజమయ్యాయి. పాకిస్తాన్ పేషావర్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది మృతి చెందిగా, సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు. పెషావర్‌లో అవామీ నేషనల్ పార్టీ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటను చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

మృతుల్లో ఏఎన్‌పీ అభ్యర్థి హరూన్‌ బిలౌర్ కూడా ఉన్నారు. పాకిస్తాన్‌లో ఈ నెల 25న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల బరిలో హరూన్ కూడా ఉన్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిష్లాల్లోనే ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని పాక్ తాలిబాన్లు ప్రకటించారు.

మరోవైపు ఈ దాడి ఘటనను పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ నేతలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న జాబితాలో ఇమ్రాన్‌తో పాటు అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్సన్‌దర్‌ వలి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు కూడా ఉన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close