బిజినెస్

SBI: మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్‌తో ఈ బ్యాంకింగ్ సేవలన్నీ సాధ్యం… ఎలాగంటే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI Quick పేరుతో మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్‌తో అనేక సేవల్ని మీ ఫోన్‌లోనే పొందొచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా మీ బ్యాంకు అకౌంట్‌కు ఫోన్ మొబైల్ నెంబర్ యాక్టివేట్ చేయడమే. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభంతో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమైన పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచిస్తోంది. అందుకే బ్యాంకులు కూడా కస్టమర్లు బ్రాంచ్‌కు రావాల్సిన అవసరం లేకుండా వీలైనన్ని బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలారోజుల క్రితం ప్రారంభించిన ఎస్‌బీఐ క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ గురించి బాగా ప్రచారం చేస్తోంది. రిజిస్ట్రేషన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, కార్ లోన్ ఫీచర్స్, ప్రధాన మంత్రి సామాజిక భద్రతా పథకాలు, డీరిజిస్టర్, ఇమెయిల్ ద్వారా అకౌంట్ స్టేట్‌మెంట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ లోన్ సర్టిఫికెట్, ఏటీఎం కార్డు ఆన్ లేదా ఆఫ్ చేయడం, గ్రీన్ పిన్ జనరేట్ చేయడం, యోనో యాప్ డౌన్‌లోడ్ చేయడం లాంటి సేవలన్నీ ఎస్‌బీఐ క్విక్ ద్వారా పొందొచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ‘ఎస్‌బీఐ క్విక్’ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాలి. REG Account Number అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ నుంచి 09223488888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. డీ రిజిస్టర్ చేయాలంటే ‘DREG’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి. ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఏటీఎం కార్డును స్వైప్ చేసి స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత స్క్రీన్‌లో Phone Banking Registration క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వస్తుంది. మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసివ్వాలి. బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది. ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫోన్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.

SBI Balance Enquiry: మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.

SBI Mini Statement: చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి. లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.

SBI E-Statement: మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు. ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.

Generate ATM PIN: మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు. PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు పంపాలి. మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP రెండురోజులే పనిచేస్తుంది.

SBI Cheque Book Request: మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి.

ATM Card Blocking: మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలంటే BLOCK అని టైప్ చేసి మీ కార్డులో చివరి నాలుగు నెంబర్లను కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే BLOCK0000 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ కార్డు బ్లాక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.

ATM Card On/Off: మీ ఏటీఎం కార్డును మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ యూసేజ్… ఏదైనా బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM అని టైప్ చేసి మీ కార్డ్ చివరి నాలుగు అంకెలు కలిపి 09223966666 నెంబర్‌కు కాల్ చేయాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM 0000 అని టైప్ చేయాలి.

SBI Loans: ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే రుణాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మీరు ‘HOME’ లేదా ‘CAR’ అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు కాల్ చేసి ఆఫర్లు తెలుసుకోవచ్చు.

PM Social Security Scheme: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన-PMSBY లేదా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన-PMJJBY పథకాల్లో కూడా ఎస్ఎంఎస్ ద్వారా చేరొచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి PMJJBY లేదా PMJJBY స్పేస్ అకౌంట్ నెంబర్ స్పేస్ నానిమీ రిలేషన్‌షిప్ స్పేస్ నామినీ ఫస్ట్ నేమ్ స్పేస్ నామినీ లాస్ట్ నేమ్ టైప్ చేసి 9223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

Services: మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ద్వారా ఏఏ సర్వీసులు లభిస్తాయో తెలుసుకునేందుకు HELP అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఎస్‌బీఐ క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Repo Rate: రెపో రేట్ తగ్గితే లాభమేంటీ? ఈఎంఐ భారం ఎలా తగ్గుతుంది?

EPF New Rule: ఈపీఎఫ్ కొత్త రూల్‌తో మీకు లాభమిదే

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close