క్రైమ్టాప్ స్టోరీస్తెలంగాణ

స్టార్ హోటళ్లా.. సెక్స్ పార్లర్లా..?

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ స్కామ్‌ గురించి విని అందరూ ఆశ్చర్యపోతే, హైదరాబాద్‌లోనే అంతకు మించి అన్నట్లుగా సాగుతోంది సినీతారల వ్యభిచారం. పోలీసులకు దొరకకూడదని స్టార్‌ హోటళ్లనే అడ్డాగా మార్చుకుని మరీ బ్రోకర్లుఈ దందాను చాలాకాలంగా నడిపిస్తున్నారు. తారల స్థాయిని బట్టి ప్రతీ స్టార్ హోటల్‌లోనూ రూమ్‌ బుక్‌ చేసి, జోరుగా బిజిసెన్ సాగిస్తున్నారు.

సెక్స్‌మాఫియా బిజినెస్‌పై దృష్టి పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కొంతకాలంగా స్టార్‌ హోటళ్లపై తరచూ దాడులు చేస్తున్నారు. నగరంలో వీఐపీలు ఎక్కువగా బసచేసే మూడు నాలుగు హోటళ్లలో జరుగుతున్న ఈ సెక్స్ ట్రేడ్ గుట్టు రట్టు చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాల నుంచి ఎక్కువగా సినీ నటులను రప్పిస్తూ హైదరాబాద్‌లో వీఐపీలకు బ్రోకర్లు వల వేస్తున్నట్లు తెలుస్తోంది.

వారానికి రూ.లక్ష రెమ్యునరేషన్‌

తాజాగా బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ హోటల్‌లో ఇలానే ఓ భోజ్‌పురి తారతో జరుగుతున్న వ్యభిచారదందాకు చెక్‌ పెట్టారు పోలీసులు. కృష్ణానగర్‌ కాలనీలో ఉంటున్న అంబుల జనార్ధన్‌రావు, జానీ, బొంతు ప్రశాంత్‌లతో కలిసి ఈ బిజినెస్‌నెస్‌ను చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. ముంబైలో పెద్దగా అవకాశాలు లేని జూనియర్‌ ఆర్టిస్టులు, బీగ్రేడ్ ఆర్టిస్టులకు ఏజెంట్ల ద్వారా వల వేస్తున్నారు. వారానికి లక్ష రూపాయలు ఇస్తామంటూ హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు. వారి ఫోటోలను సోషల్‌మీడియా, వాట్సప్‌ ద్వారా కస్టమర్లకు పంపిస్తూ ఆకర్షిస్తున్నారు. ఒక్కో విటుడు నుంచి 10 నుంచి 20 వేల రూపాయలను వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని హై సర్కిల్‌లో చాలా మంది కాంటాక్ట్స్‌ జనార్ధన్‌కు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. పక్కా సమాచారంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఓ భోజ్‌పురి తారను తీసుకొచ్చిన జనార్ధన్‌ రాడిసన్ హోటల్‌లో ఉంచాడు. కస్టమర్లను అక్కడికి పంపిస్తూ, తాను మాత్రం హోటల్ సమీపంలోనే మాటు వేసి ఉంటున్నాడు. ఆదివారం హోటల్‌పై రైడ్‌ చేసిన పోలీసులు జనార్దన్‌ను, తారతో గదిలో ఉన్నవిటుడు అమిత్‌ మహేంద్ర శర్మను అరెస్ట్ చేశారు. భోజ్‌పురి తారను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

స్టార్‌ హోటల్స్‌కు క్లీన్ చిట్‌

అయితే, ఈ దందా స్టార్ హోటల్స్‌కు ఎలాంటి పాత్ర లేదంటున్నారు పోలీసులు. ఆన్‌లైన్‌లో రూమ్స్‌ బుక్ చేస్తున్నారని, తారలను నేరుగా రూమ్స్‌కు పంపించేస్తున్నారన్నారు. స్టార్ హోటల్ కావడం, వచ్చేది మోడల్స్‌ కావడంతో ఎవరికీ అనుమానం రావడం లేదన్నారు. కస్టమర్లు కూడా విజిటర్లలా నేరుగా రూమ్‌కు వెళ్లిపోతుండడంతో స్టార్ హోటల్స్‌ సిబ్బంది ఈ బిజినెస్‌ను గుర్తు పట్టలేదంటున్నారు.

అక్కడ సెక్యూరిటీ అంతేనా!

అయితే, ఎంతో మంది వీఐపీలు వచ్చే స్టార్‌ హోటల్స్‌లో ఈ మాత్రం గుర్తుపట్టనంతగా వ్యవస్థ ఉంటుందా..? హై సెక్యూరిటీ, సీసీ కెమెరాలతో పహారా ఉండే హోటళ్లలో, ఒకే గదిలోకి రోజూ రకరకాల వ్యక్తులు వెళ్లి గంటలు గంటలు ఉండి వస్తున్నా పట్టించుకోనంతగా ఉంటుందా..? అన్నదే అనుమానాలు కలిగిస్తోంది. హోటల్‌లోని కొంతమంది సిబ్బంది అండ లేకపోతే, ఈ దందా ఇంతగా సాగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close