అంతర్జాతీయంటాప్ స్టోరీస్

మ‌ళ్లీ మౌకా మౌకా యాడ్‌.. పాక్‌ను టీజ్ చేసిన స్టార్‌స్పోర్ట్స్‌.. వీడియో

దుబాయ్‌: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్( India vs Pakistan ) మ‌ధ్య మ్యాచ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఈ దాయాదుల పోరు కోసం క్రికెట్ ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఇంత వ‌ర‌కూ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియాపై గెల‌వ‌ని పాకిస్థాన్ ఈసారి ఎన్నో ఆశ‌ల‌తో బ‌రిలోకి దిగుతోంది. ఆ టీమ్ వెంట ప‌టాకులు ప‌ట్టుకొని ఆ అభిమాని కూడా వ‌చ్చేశాడు. ఈసారి దుబాయ్‌లో గెలుపు ప‌క్కా.. అక్క‌డ ప‌టాకులు కాలుస్తానంటూ వ‌చ్చాడు. ఇంత‌కీ అత‌డు ఎవ‌ర‌నే కదా మీ డౌట్‌. ఆ మ‌ధ్య ఇండోపాక్ మ్యాచ్ సంద‌ర్భంగా మౌకా మౌకా యాడ్ ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలుసు క‌దా. 2015 వ‌ర‌ల్డ్‌క‌ప్ టైమ్‌లో ప్రారంభ‌మైన ఈ యాడ్‌.. ప్ర‌తి ఐసీసీ టోర్నీలో ఈ దాయాదులు త‌ల‌ప‌డిన‌ప్పుడ‌ల్లా వ‌స్తూ అభిమానుల‌ను అలరిస్తోంది.

ఇప్పుడు మ‌రోసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సంద‌ర్భంగా ఆ మౌకా మౌకా యాడ్‌లోని పాక్ అభిమాని మ‌ళ్లీ ప‌టాకులు ప‌ట్టుకొని దుబాయ్ వ‌చ్చాడు. ఈ లేటెస్ట్ యాడ్‌ను బ్రాడ్‌కాస్ట‌ర్ స్టార్‌స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. కాస్త ఫ‌న్నీగా, ప్ర‌త్య‌ర్థిని స‌ర‌దాగా ఏడిపించేలా ఈ ప్రోమో రూపొందించారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండోపాక్ మ్యాచ్ చూడటానికి ఓ పేద్ద టీవీ కొన‌డానికి త‌న ఫ్రెండ్ షోరూమ్‌కు ప‌టాకులు ప‌ట్టుకొని వ‌స్తాడు ఆ పాక్ అభిమాని. ఈ సంద‌ర్భంగా ఆ టీవీ షోరూమ్ ఓన‌ర్‌.. అత‌న్ని ఆట ప‌ట్టిస్తాడు. ముఖ్యంగా ఇండియ‌న్ ఫ్యాన్స్ ఈ ప్రోమోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నెల 24న ఇండియా, పాకిస్థాన్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌న్డే, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో ఎప్పుడూ పాక్ చేతిలో ఇండియా ఓడ‌లేదు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో ఐదుసార్లు త‌ల‌ప‌డ‌గా.. అన్ని మ్యాచ్‌లూ ఇండియానే గెలిచింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close