ఆంధ్ర

విజయవాడ-నిడదవోలు సెక్షన్‌లో మరమ్మతులు.. 12న విశాఖ-విజయవాడ రైలు రద్దు

  • 12న విశాఖ-లింగంపల్లి, లింగంపల్లి-విశాఖ రైళ్లు గుడివాడ మీదుగా మళ్లింపు
  • విజయవాడ-విశాఖ రైలు కూడా రద్దు
  • సికింద్రాబాద్-చాప్రా రైళ్లు ఈ నెల 28 వరకు పొడిగింపు

విజయవాడ-నిడదవోలు సెక్షన్‌లో మరమ్మతులు జరుగుతున్న కారణంగా రెండు రైళ్లను మళ్లిస్తుండగా, మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్టణం-లింగంపల్లి రైలు (02831)ను ఈ నెల 12 నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

అలాగే, లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే రైలు (02832)ను కూడా అదే రోజున అవే స్టేషన్ల గుండా మళ్లిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్టణం-విజయవాడ (02717), విజయవాడ-విశాఖపట్టణం (02718) రైళ్లను 12న రద్దు చేసినట్టు వివరించారు. సికింద్రాబాద్-చాప్రా (07051, 07052) రైళ్లను ఈ నెల 28 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close