ఆంధ్ర

జర్నలిస్టుల సమస్యల పై సీఎం తో చర్చిస్తా

  • త్వరలోనే పెండింగ్‌ సమస్యలు పరిష్కరానికి కృషి
  • అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం : జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేందుకు తమవంతు కృషిచేయడం జరుగుతుందని వైయస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. బుధవారం అమర్‌నాథ్‌ పుట్టినరోజు వేడుకల సందర్ధంగా జాతీయ జర్షలిస్తుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్షలిస్టుల ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా ఆయనను కలుసుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్ధంగా సింవాద్రినాథుని జ్ఞాపికను బహుకరించి, జర్షలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు మంజూరు, పెన్నన్‌ ఏధానం వంటి అన్ని హామీలను ప్రభుత్వం అమలుచేసేవిధంగా చూడాలని శ్రీముబాబు కోరారు. దినితో అమర్‌నాథ్‌ సానుకూలంగా స్పందించి ఇప్పటికే జర్నలిస్టుల పెండింగ్‌ సమస్యలను తాను అసెంబ్లీలో ప్రస్తావంచడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీనుకువెళ్లి ఆయా సమన్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close