అంతర్జాతీయం

భర్త మీద కోపంతో ఐదుగురు బిడ్డలను చంపిన కిరాతక తల్లికి జీవితఖైదు

  • జర్మనీలోని సోలింగెన్ లో ఆరుగురు పిల్లలతో నివసిస్తున్న తల్లి
  • భర్త మరో మహిళతో ఉండడంతో ఆగ్రహం
  • పిల్లలకు మత్తు ఇచ్చి హత్య చేసిన వైనం
  • ఆత్మహత్య చేసుకోబోగా కాపాడిన స్థానికులు

జర్మనీలో ఓ మహిళ భర్త మరో స్త్రీతో ఉండడాన్ని తట్టుకోలేక గతేడాది కన్నబిడ్డలను కడతేర్చింది. ఆ కేసులో ఆమెకు జీవితఖైదు పడింది.

సోలింగెన్ లో నివసించే క్రిస్టియానే (28)కి ఆరుగురు సంతానం ఉన్నారు. కొన్నాళ్లుగా ఆమెకు భర్త దూరంగా ఉంటున్నాడు. అయితే, భర్త మరో మహిళతో ఉన్న ఫొటో ఆమె కంటబడింది. దాంతో రగిలిపోయిన క్రిస్టియానే, తన కోపానికి కన్నబిడ్డల్లో ఐదుగురిని బలి చేసింది. మత్తుమందు కలిపిన స్నాక్స్ ను వారికి తినిపించి, వారు స్పృహ కోల్పోయాక హత్య చేసింది. ఆ పిల్లల్లో 8 ఏళ్ల వయసు నుంచి ఏడాది వయసున్న వారు ఉన్నారు. ఓ పిల్లవాడు స్కూల్లో ఉండడంతో బతికిపోయాడు.

పిల్లలను చంపిన అనంతరం క్రిస్టియానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోగా స్థానికులు రక్షించారు. విషయం ఏంటని పోలీసులు ఆరా తీయగా జరిగిన ఘాతుకం వెల్లడైంది. దాంతో పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.

తాను పిల్లలను చంపలేదని, ముసుగు ధరించి ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని క్రిస్టియానే కోర్టును నమ్మించే ప్రయత్నం చేసింది. కాని ప్రాసిక్యూషన్ వారు ఆమె చెప్పినవి కట్టుకథలు అని తేల్చడంతో న్యాయస్థానం ఆమెకు జీవితఖైదు విధించింది. అంతేకాదు, 15 ఏళ్ల పాటు ఆమెకు పెరోల్ ఇవ్వరాదని ఆదేశించింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close