టాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్సినిమా

అలాంటి వారిని నమ్మొద్దన్న శేఖర్‌ కమ్ముల

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు స్టార్‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన పేరుతో కొంతకాలంగా  డబ్బులు వసూలు చేస్తున్న సంజయ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నటీనటుల ఎంపిక కోసం తన తరపున ఎవరూ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేయడం లేదంటూ వివరణ ఇచ్చారు.

సంజయ్ అనే వ్యక్తి కొంతకాలంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ చాలామందిని మోసం చేస్తున్నాడు. క్విక్కర్‌, టాలెంట్ ట్రాక్‌ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తూ ఆకర్షిస్తున్నాడు. వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుతూ మోసం చేస్తున్నాడు. ఈ విషయం శేఖర్ కమ్ముల దృష్టికి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్నే తన పోస్ట్‌లో వివరంగా పేర్కొన్నారు శేఖర్ కమ్ముల.

“సంజయ్ అనే నకిలీ వ్యక్తి, నా assistant / casting director అంటూ నటులు కావాలని quikr లో యాడ్ ఇచ్చి, డబ్బులు వసూలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. బాధితుల్లో ఒకరైన, ఒంగోలుకి చెందిన ప్రదీప్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మా ఆఫీస్ కి వచ్చి, ఈ విషయాన్ని మాకు తెలియజేశాడు.
నేను వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను. ఒక వారంలోనే ఈ మోసగాడిని సైబర్ పోలీసులు పట్టుకున్నారు.
సైబర్ క్రైమ్ డి.సి.పి. శ్రీ కె.సి.ఎస్. రఘు వీర్ గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. రమేష్ గారికి, ఈ టీమ్ లో పని చేసిన ఎస్.ఐ నరేష్, వెంకటేశం, ఏ. ఎస్. ఐ వెంకట్ రెడ్డి, పి.సి మహేశ్వర రెడ్డి , ఫిరోజ్, శ్యామ్, హరి గార్లకి నేరస్తుడిని పట్టుకున్నందుకు ధన్యవాదాలు.

నేను ఎప్పుడూ కూడా casting director ని నియమించుకోలేదు. ఎవరైనా నా సినిమాలో పాత్రకి సరిపోతారు అనిపిస్తే, వాళ్ళని మా డైరెక్షన్ team కాంటాక్ట్ చేస్తారు. నా సినిమాలో నటించేందుకు కానీ, నా సినిమాకి పని చేసేందుకు గానీ.. ఎప్పుడూ ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోము. మాతో పని చేసిన వాళ్ళకి మేమే డబ్బు చెల్లిస్తాం.

దయచేసి ఇటువంటి ప్రకటనలు చూసే మోసపోకండి.” అంటూ పోస్ట్ చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close