రాజకీయం

నోటిఫికేషన్స్ విడుదల చేయలేకపోతే రాజీనామా చెయ్ -ష‌ర్మిల‌ డిమాండ్

  • ఇది కేసీఆర్ చేసిన హత్య
  • వందల సంఖ్య‌లో నిరుద్యోగులు చనిపోతున్నారు
  • ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి, రాక్షసానందం పొందుతున్నాడు 

హైద‌రాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హకీంపేట ఫాతిమా కాలనీలో నివసించే జునైద్‌ ఇక్బాల్‌ ఒస్మాని(28) అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యానికి సంబంధించి వ‌చ్చిన ఓ వార్త‌ను వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పోస్ట్ చేశారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఇక్బాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్తాపం చెంది ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయాడ‌ని అందులో తెలిపారు.  

‘సివిల్ ఇంజి‌నీరింగ్ చేసి కూడా ఉద్యోగాలు దొరకక నిరాశలో తమ్ముడు ఇక్బాల్ ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న. ఇది కేసీఆర్ చేసిన హత్య. వందల సంఖ్య‌లో నిరుద్యోగులు చనిపోతుంటే ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి, రాక్షసానందం పొందుతున్నాడు కేసీఆర్. ఇంకెంత మందిని చంపుతవ్ దొరా? నోటిఫికేషన్స్ విడుదల చేయలేకపోతే రాజీనామా చెయ్’ అని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close