క్రీడలు

ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీని విడదీసిన శార్దూల్ ఠాకూర్

  • లండన్ లో ఆసక్తికరంగా నాలుగో టెస్టు
  • ఇంగ్లండ్ ముందు 368 పరుగుల టార్గెట్
  • తొలి వికెట్ కు 100 రన్స్ జోడించిన ఇంగ్లండ్ ఓపెనర్లు
  • రోరీ బర్న్స్ ను అవుట్ చేసిన ఠాకూర్

నాలుగో టెస్టులో ఐదో రోజు ఆట ప్రారంభమైంది. 368 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది. ఆతిథ్య జట్టు తొలి వికెట్ కు 100 పరుగులు జోడించింది. ఓపెనర్లు రోరీ బర్న్ (50), హసీబ్ హమీద్ (54 బ్యాటింగ్) భారత బౌలర్లను పట్టుదలతో ఎదుర్కొని లక్ష్యఛేదనకు సరైన పునాది వేశారు.

అయితే, టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఈ జోడీని విడదీశాడు. ఓ చక్కని బంతితో రోరీ బర్న్స్ ను అవుట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 46 ఓవర్లలో 109 పరుగులు కాగా, విజయానికి మరో 259 పరుగులు కావాలి. క్రీజులో ఓపెనర్ హసీబ్ హమీద్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలాన్ ఉన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close