స్పెషల్

మార్కెట్లకు రిలీఫ్‌ ర్యాలీ

  • సెన్సెక్స్‌ 635, నిఫ్టీ 190 పాయింట్ల లాభం..
  • మళ్లీ 41వేల పాయింట్లు దాటిన ప్రధాన సూచీ

ముంబై, జనవరి 9: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా నష్టాలతో కాలంవెళ్లదీసిన సూచీలకు అమెరికా-ఇరాన్‌ దేశాలు యుద్ధం కోరుకోవడం లేద న్న వార్తలు ఊతమిచ్చాయి. మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ప్రారంభం నుంచే లాభాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ వెనక్కితిరిగి చూసుకోలేదు. ఒక దశలో 700 పాయింట్ల వరకు లాభపడ్డ 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 41 వేల పాయింట్లను దాటగా, జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ తిరిగి 12 వేల పాయింట్ల మార్క్‌ను దాటింది. తమ దేశం యుద్ధం కోరుకోవడం లేదంటూ ఇరాన్‌ విదేశాంగ మంతి జావేద్‌ జరీఫ్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లకు ఆక్సిజన్‌లా పనిచేశాయి. ప్రారంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభపడిన సూచీ చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 634.61 పాయింట్లు లేదా 1.55 శాతం ఎగబాకి 41,452.35 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 190.55 పాయింట్లు(1.58 శాతం) అందుకొని 12,215.90 వద్ద స్థిరపడింది. తమ దేశం శాంతిని కోరుకుంటున్నది తప్పా..యుద్ధం కోరుకోవడం లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు మార్కెట్లకు ఉత్తేజాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. వీటితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి చర్యలు తీసుకుంటున్న నరేంద్ర మోదీ ప్రకటన కూడా మార్కెట్లు పుంజుకోవడానికి పరోక్షంగా దోహదం చేశాయి.
-30 షేర్ల ఇండెక్స్‌లో 26 షేర్లు లాభాల బాట పట్టగా, కేవలం నాలుగు మాత్రమే నష్టపోయాయి.
-ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.80 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. వీటితోపాటు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్బీఐ, భారతీ ఇన్‌ఫ్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటర్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి, ఏసియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌ ఇంండస్ట్రీలు లాభపడ్డాయి.
-టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, ఎన్టీపీసీ, సన్‌ఫార్మాలు రెండు శాతం వరకు నష్టపోయాయి.
-ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.431.11 కోట్ల నిధులను చొప్పించారు.
-బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.51 శాతం లాభపడగా, స్మాల్‌ క్యాప్‌ 1.55 శాతం ఎగబాకింది.
-1,820 కంపెనీల షేర్లు వృద్ధిని నమోదు చేసుకోగా, 752 షేర్లు పతనం చెందాయి. 208 షేర్లు యథాతథంగా ఉన్నాయి.
-195 స్టాకులు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా, 155 స్టాకులు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. 69 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి, 62 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి.
-రియల్టీ, ఆటో, బ్యాంకెక్స్‌, ఇండస్ట్రీయల్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు మూడు శాతం వరకు పెరుగగా, ఐటీ రంగ సూచీలు మాత్రం నష్టపోయాయి.
-బుధవారం సెన్సెక్స్‌ 51 పాయింట్లు, నిఫ్టీ 27 పాయింట్లు పడిపోయిన విషయం తెలిసిందే.
-అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లో టోక్యో నిక్కీ 2.2 శాతం, హాంకాంగ్‌ 1.1 శాతం, షాంఘై కంపొజిట్‌ ఇండెక్స్‌, సిడ్నీ ఎస్‌అండ్‌పీ సూచీలు లాభాల్లో ముగిశాయి.

రూ.2.25 లక్షల కోట్లుపెరిగిన సంపద

స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో మదుపరుల సంపద అమాంతం రూ.2.25 లక్షల కోట్ల మేర పెరిగింది. మార్కెట్లో సెంటిమెంట్‌ మెరుగుపడటంతో సెన్సెక్స్‌ 635 పాయింట్లకు పైగా లాభపడటంతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ. 2,25,554.62 కోట్లు పెరిగి రూ. 1,57,06,155.38 కోట్లకు ఎగబాకింది. అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ.. మేము యుద్ధా న్ని కోరుకోవడం లేదని, కేవలం శాంతిని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యలు మార్కెట్లలో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఈ వ్యాఖ్యలపై ఇరాన్‌ కూడా ఇదే విధంగా స్పందించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.

రూపాయి మెరుపులు

గతవారం రోజులుగా భారీగా చిల్లులు పడిన దేశీయ కరెన్సీ విలువ ఎట్టకేలకు కోలుకున్నది. బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్‌ను విక్రయించడానికి మొగ్గుచూపడంతో రూపాయి విలువ ఏకంగా గురువారం 48 పైసలు ఎగబాకింది. ఫారెక్స్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి డాలర్‌-రుపీ ఎక్సేంజ్‌ రేటు 71.21 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించారు. 71.44 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ 71.52 నుంచి 71.17 మధ్య స్థాయిలో కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గడం రూపాయి బలోపేతానికి దోహదపడినట్లు ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు. మిగతా ఆరు కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close