ఆంధ్ర

ఏపీలో వచ్చే నెల 16 నుంచి బడుల పునఃప్రారంభం

  • ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు
  • ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయులకు వర్క్ బుక్స్‌పై శిక్షణ
  • నూతన విద్యా విధానాన్ని అమలు చేసి తీరుతామన్న ఆదిమూలపు 

కరోనా మహమ్మారి కారణంగా సంవత్సరానికిపైగా మూతబడిన పాఠశాలలను తిరిగి తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానుండగా వచ్చే నెల 16 నుంచి బడులు తెరవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు వర్క్ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్న మంత్రి.. ఈ విధానం వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడదని, ఒక్క ఉపాధ్యాయుడి పోస్టు కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఇంటర్ విద్యార్థులకు 70 శాతం ఇంటర్ ఫస్టియర్ మార్కులు, పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మెమోలు జారీ చేస్తామని మంత్రి సురేశ్ తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close