జాతీయంటాప్ స్టోరీస్

ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ

ఫిక్స్ డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూలై 30 వ తేదీ సోమవారం నుంచే పెరిగిన వడ్డీ రేట్టు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రిజర్వ్‌ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరంలోపు డిపాజిట్లపై మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఏడాది నుంచి పదేళ్ల కాల పరిమితిలో డిపాజిట్‌ చేసిన సొమ్ముకి వడ్డీ రేట్లు పెంచారు.

ఏడాది నుంచి రెండెళ్ల వరకు కాల పరమితిపై 6.65 నుంచి 6.7 శాతం వడ్డీ పెంచారు. రెండు నుంచి మూడేళ్ల కాలపరిమితిపై 6.65 నుంచి 6.75 శాతం వరకు వడ్డీ పెరిగింది. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై 6.7 నుంచి 6.8శాతం వరకు వడ్డీ పెరిగింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని 6.75 నుంచి 6.85 శాతానికి పెంచారు.

ఇక సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు పెంచింది ఎస్బీఐ. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి 7.15 నుంచి 7.2శాతానికి వడ్డీ పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితికి 7.15 నుంచి 7.25శాతానికి వడ్డీ రేటు పెరిగింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై 7.2 నుంచి 7.3శాతానికి వడ్డీ పెంచారు. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు డిపాజిట్లపై 7.25 నుంచి 7.35శాతానికి వడ్డీ పెరిగింది. ఇవన్నీ కూడా కోటి రూపాయలు, అంత కంటే తక్కువ డిపాజిట్లపైనే పెరిగిన వడ్డీ రేట్లు అమలు అవుతాయి. ఎస్‌బీఐ బాటలోనే మిగతా బ్యాంకులు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచే అవకాశం ఉంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close